Indira Gandhi birthday celebrations by TPCC NRI Cell UK

490 0
490 0

లండన్ లో శ్రీమతి ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు
దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహా నేత ఇందిరమ్మ – కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి
—-
ఈ రోజు లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యం లో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు .

కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి ముఖ్య అతిథి గా విచ్చేసి ప్రసంగిస్తూ ,ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట పెంచిన ఇందిరా. “గరీబి హఠావో” నినాదంతో భారత దేశంలో పేదిరిక నిర్ములనకు పునాధులువేసి, దళిత గిరిజన బలహీనవర్గాల అండగా వుంటూ భూ పంపిణీకి పునుకొని ,బ్యాంకుల జాతీయికరణతో పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారని ఇందిరమ్మ తరతరాలకు ఆదర్శనీయం అని తెలిపారు . దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ,భారత దేశం ఐక్యత, సమీకృత అభివృద్ధి, మత సామరస్యం , పేదల అభ్యుదయo కేవలం కాంగ్రెస్ తో నే సాధ్యం అని తెలిపారు . దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకత్వం ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ నే అని తెలిపారు .కాంగ్రెస్ బలోపేతం కోసం NRI కు చాలా కృషి ని అభినందిస్తూ , కేంద్ర లో, తెలంగాణ రాష్ట్టంలో 2019 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడంలో ప్రతి NRI కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ,
సేవా కార్యక్రమాల్లో , సంస్కృతి ప్రచారం లో ,ప్రజా సమస్యల పై పోరాటం లో లండన్ ఎన్నారై సంస్థలు స్ఫూర్తినీయం అని తెలిపారు .

ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ పుట్టుక ,చావు మాత్రమే ఇందిరమ్మది ,బతుకు అంతా దేశం కోసమే ఇందిరమ్మ. దేశ ప్రజలకు ఒక దైర్యం గా ఖ్యాతి గాంచారు, దేశ అభివృద్ధి లో ఇందిరమ్మ సేవలు చిరస్మరణీయ అని కొనియాడారు .

కార్యక్రమం లో ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పువ్వులు సమర్పించి చిన్నారుల సమక్షం లో 100 వ పుట్టిన రోజు ప్రత్యేకం గ తయారు చేపించిన భారీ కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు .

వంశీచంద్ రెడ్డి సమక్షం లో ఎన్నారై మహిళ లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు . అస్ర అంజూమ్ ,సరిత , జి శ్రీధర్ రెడ్డి లు కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరారు .

సలహాదారులు గంగసాని ప్రవీణ్ రెడ్డి అధ్యక్షన జరిగిన కార్యక్రమం లో కో కన్వీనర్లు చిట్టెం అచ్యుత రెడ్డి ,రంగుల సుధాకర్ గౌడ్, రాకేష్ బిక్కుమళ్ల ,మంగళారపు శ్రీధర్ బాబు ,అస్ర అంజూమ్ ,సరిత , పోటాటి శ్రీకాంత్ రెడ్డి ,కొత్త రామ్మోహన్ రెడ్డి ,శ్రీధర్ రెడ్డి ,నర్సింహా రెడ్డి జాన్సర్ ,బలరాం ,హితేష్ గుప్తా ,సుదర్శన్ రెడ్డి ,గట్ట మధు లు ప్రసంగించి ఇందిరమ్మ గురించి ప్రసంగించి కార్యక్రమం విజయవంతం లో కీలకపాత్ర పోషించారు .

అనంతరం టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యం లో బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు లండన్ విచ్చేసిన వంశీ చంద్ రెడ్డి ని ఘనం గ సన్మానించారు అనంతరం ప్రత్యేకం గ తయారుచేసిన తెలంగాణ వంటకాలను విచ్చేసిన అతిధి లకు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించారు .

In this article

Join the Conversation