TRS Australia express thanks to CM KCR over special package to farmers

936 0
936 0

Date: 14/04/2017

TRS Australia

Press Release:

కెసిఆర్ నిజమైన రైతు బాంధవ పాలకుడు.

కేసీఆర్ కు తెరాస ఆస్ట్రేలియా నీరాజనం .

రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటీంచిన చారిత్రాత్మక వ్యవసాయ విధానాల పట్ల తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు . రైతులకు ఏదో సబ్సిడీ అనకుండా “రైతులకు ఎరువులు పూర్తిగా ఉచితం” అన్న కేసీయార్ ప్రకటన చూసిన తరువాత ” నిజమైన రైతు బాంధవ పాలకుడు” ఆనక తప్పడం లేదు!!
వ్యవసాయాన్ని చంద్ర బాబు దండగమారి చేస్తుంటే కెసిఆర్ పండగమారి చేస్తున్నాడని,దశాబ్దాల తరబడి కునారిల్లిన తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురింప చేసిందని తెరాస ఆస్ట్రేలియా నాయకులూ నాగేందర్ రెడ్డి ,డా . అనిల్ రావు చీటీ , సాయి రామ్ ఉప్పు మరియు సునీల్ బసిరెడ్డి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

వైస్ ప్రెసిడినెట్ డా. చీటీ అనిల్ రావు మాట్లాడుతూ “రైతాంగానికి 9 గంటలు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తు అందిచడం దేశ చరిత్రలో ప్రథమం అని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుండి రాష్ట్రంలోని రైతులందరికి 24 లక్షల నుంచి 26 లక్షల టన్నుల వరకు ఎరువులు రైతులకు ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాడం ఎవరూ ఊహించనిదన్నారు. విక్టోరియా కన్వీనర్ సాయిరాం ఉప్పు మాట్లాడుతూ”ఎకరానికి 2 దుక్కి మందు, 3 యూరియా బస్తాలను ఉచితంగా ఇస్తామనడం ముదావహం. ఎకరానికి రూ. 4 వేల నుంచి నాలుగున్నర వేల వరకు పెట్టుబడి కూడా ప్రభుత్వమే భరిస్తదని చెప్పడం బక్క రైతులకు పెద్ద భరోసా అని ,
చరిత్రలో తొలిసారిగా సంపూర్ణ రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తుల్ని చేయడం అపూర్వమైనదన్నారు.

ఆత్మహత్యలు ,ఆకలి పేదరికం లేని బంగారు తెలంగాణను తీర్చి దిద్దుతున్నందుకు నాగేందర్ రెడ్డి కాసర్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు .

In this article

Join the Conversation