Galleries

Eco friendly Ganesh idols distributed by TJUK team in UK

పర్యావరాణాన్ని కాపుడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం , మన తరం అనుభవించే ప్రకృతి వనరులు భావి తరాలకు అందించే బాధ్యత కూడా మనదే , దానికి అందరు తమ వంతు గ కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది , దానిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జాగృతి ఎప్పుడు సమాజాన్ని జాగృతి పరిచే పనిలో ముందు ఉంటుంది అందులో భాగంగ పర్యావరణాన్ని భారత దేశం లో నే కాదు ప్రపంచం లో ఎక్కడైనా చేయాలనీ సంకల్పించి తెలంగాణ జాగృతి యూకే విభాగం ఒక్క అడుగు ముందుకు వేస్తూ వినాయక చవితి కి మట్టి తో చేసిన గణపయ్యలను పూజించాలని ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేస్తూ , అందుకు తమ వంతుగా 100 మట్టి వినాయకులను ఉచితంగా పంచడానికి ముందు వచ్చింది ,

లండన్ లో ని మహా లక్ష్మి ఆలయం లో ఈ రోజు నూరు మట్టి వినాయకులను (ఎకో గణేష్ ) అక్కడికి వచ్చిన భక్తులకు జాగృతి యూకే బృందం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగింది , ఒక వంతు సామజిక స్పృహ తో జనులను జాగృతి చేసే పనిలో నిమగ్నం అవడమే కాదు ప్రతి సత్కార్యానికి మేము ముందు ఉంటామని జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి తెలిపారు , అక్కడికి వచ్చిన భక్తులు మట్టి గణపయ్యలను తీసుకోవడం ఆనందంగా ఉందని , ఎకో గణేష్ ల ను పూజిస్తామని జాగృతి చేపట్టిన ఈ గొప్పడుగు ఎందరికో స్ఫూర్తి దాయకమని తెలిపారు , ఈ కార్యక్రమం లో జాగృతి అధ్యక్షులు సుమన్ బలమూరి, అడ్వైసర్ కిషోర్ మునగాల తో పాటు ఉపాధ్యక్షులు సుష్మ జువ్వాడి , వంశీ తులసి మరియు జాగృతి ప్రధాన కార్యవర్గ సభ్యులు వంశీ మునిగంటి , వెంకట్ బాలగోని , LN రెడ్డి , రాజేష్ ఎనపోతుల, శ్రావణి బలమూరి, దీపికా తులసి, మాధవి రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు .
మీడియా & PR — వంశీ మునిగంటి

Related posts

లండన్ గడ్డపై ప్రవాస తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ సంబరాలు(TJUK)

edlabandi

Team TJUK meet and facilitated Hon’ble Speaker Pocharam Srinivas Reddy Garu at London

edlabandi

Sye raa premier show in UK

edlabandi

Leave a Comment